/rtv/media/media_files/2024/11/25/XWGaBUjmdn8TlVMY6L2C.jpg)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభలో గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపుర్ మళ్లీ చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై కేంద్రాన్ని నిలయదీయాలని విపక్ష పార్టీలు ముందుగానే సిద్ధమయ్యాయి. దీంతో సమావేశాలు ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్‌లో వ్యాపార రంగంపై అదానీ గ్రూప్ ప్రభావం, అలాగే ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది.
Also Read: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్, స్కూల్స్ బంద్
సభలో తొలుత ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభతో పాటు రాజ్యసభలు నవంబర్ 27కు వాయిదా పడ్డాయి.
Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత
ఈ సమావేశాలకు ముందు ప్రధానీ మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. '' అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవు. అందుకే పదేపదే ఇలాంటి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. పిడికెడు మంది సభ్యులు సభను అడ్డుకుంటారు. కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారు. ప్రజల ఆకాంక్షలను సభ్యులు అర్థం చేసుకోవాలని'' ప్రధాని మోదీ అన్నారు.
Also read: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!
మరోవైపు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న పాత పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నవంబర్ 27 పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కేంద్రం మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది.
Also Read: రష్యా సైన్యంలో చేరేవారికి పుతిన్ బంపర్ ఆఫర్..