RJD : RJD సంచలన నిర్ణయం.. 143 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని అభ్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కని ఆర్జేడీ నాయకుడు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం బయట తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు
జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్డీఏ సీట్ల పంపకంలో భాగంగా తమకు కేటాయించిన 101 సీట్లలో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ ఆర్జేడీలో ముసలం పుట్టింది. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యర్థులకు పార్టీ టికెట్లు పంపిణీ చేయగా.. ఆయన చిన్న కుమారుడు, పార్టీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వాటిని వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది.
బీహార్ లో ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్. పార్టీ కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు.
బీహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ మంగళవారం తన రాజకీయ అరంగేట్రం చేసింది. పాట్నాలో రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు.
జేడీయూ (JDU) పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ నివాసం వద్ద ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో టికెట్ల పంపిణీ విషయంలో అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.