Prashant Kishore: అభ్యర్థులను బెదిరిస్తున్నారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ

ఎన్నికల్లో పోటీచేస్తున్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు బెదిరిస్తున్నాయని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్  సంచలన ఆరోపణ చేశారు.

New Update
JSP founder Prashant Kishor

JSP founder Prashant Kishor

Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణల పర్వం జోరందుకుంటోంది. ఎన్నికల్లో పోటీచేస్తున్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు బెదిరిస్తున్నాయని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్  సంచలన ఆరోపణ చేశారు.  బీహార్‌ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్డీయే ఈ చర్యలకు పాల్పడుతోందని మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో  మాట్లాడుతూ ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

ఎన్డీఏలో ప్రధాన పార్టీ అయిన బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే జన్‌ సురాజ్ పార్టీ నుంచి పోటీకి దిగిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'కొన్నేండ్లుగా బీహార్‌ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం  తామేననే రెప్యుటేషన్‌ను బీజేపీ తెచ్చుకుంది. ఇప్పుడు బీహార్‌లో కొత్త ప్రచారాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో బీజేపీ బెదిరింపులకు దిగుతోంది. మాకు ఓటేయండి.. లేదంటే లాలూ జంగిల్ రాజ్ మళ్లీ వస్తోంది.. అని చెబుతున్నారు.గత నాలుగైదు రోజులుగా ముగ్గురు జన్ సురాజ్ అభ్యర్థులను బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా ఎన్డీఏ చేసింది' అని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ఆరోపించారు.

Also Read :  దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?


అభ్యర్థులకు భద్రత కల్పించండి


బీహార్ లో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ప్రశాంత్ కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరారు. ఎన్డీఏ నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకునేలా చేస్తోంది. తద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్‌ను బీజేపీ ఇక్కడ కూడా అమలు చేయాలనుకుంటోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కాగా, జన్‌సురాజ్ పార్టీ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టింది. తాజాగా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో 240 సీట్లకు పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని  ప్రశాంత్ కిషోర్ గతంలోనే ప్రకటించని విషయం తెలిసిందే.

Also read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు