/rtv/media/media_files/2025/10/20/rjd-vs-congress-on-several-seats-as-mahagathbandhan-fails-to-reach-seat-sharing-deal-2025-10-20-21-02-17.jpg)
RJD vs Congress on several seats as Mahagathbandhan fails to reach seat-sharing deal
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ 19 స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (6), హిందుస్థానీ అవామ్ మోర్చా (6) స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
Also Reda: INS విక్రాంత్‌పై ప్రధాని దీపావళి వేడుకలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?
అయితే విపక్ష కూటమి అయిన మహాఘఠ్‌బంధన్‌లో మాత్రం సీట్ల సర్ధుబాటుపై విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ పలు స్థానాల్లో మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌తో కూడా పోటీ పడనుంది. ఈ రెండు పార్టీలకు సీట్ల సర్ధుబాటు విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. గత కొన్ని వారాలకు మహాఘఠ్‌బంధన్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఎంచుకోవడంలో ఈ విపక్ష పార్టీలు విఫలమవుతున్నాయి. మరోవైపు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అసలు తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఆర్జేడీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం
మరోవైపు లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పశ్వన్ కూడా మహాఘఠ్ బంధన్ కూటమిపై విమర్శలు చేశారు. కొన్ని సాధారణ సీట్లలో కూడా పోటీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మాత్రం సవాలుగా ఉండే స్థానాలను అప్పగించిందని విమర్శలు చేశారు. ఇది స్నేహపూర్వక పోరాటం కాదంటూ మండిపడ్డారు.
Follow Us