బీహార్ లో ముక్కలైన మహాకూటమి.. కాంగ్రెస్, RJD తలోదారి.. మహారాష్ట్ర రిజల్ట్స్ రిపీట్?

అసెంబ్లీ ఎన్నికలతో బీహార్ రాజకీయం మరింత వేడెక్కింది. NDAకూటమి ఇప్పటికే అభ్యర్ధలను ప్రకటించగా.. ఇండియా కూటమి (మహాగఠ్‌బంధన్)  సీట్ల పంపకాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు.

New Update
bihar rjd

అసెంబ్లీ ఎన్నికలతో బీహార్ రాజకీయం మరింత వేడెక్కింది. NDAకూటమి ఇప్పటికే అభ్యర్ధలను ప్రకటించగా.. ఇండియా కూటమి (మహాగఠ్‌బంధన్)  సీట్ల పంపకాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. ఎనిమిది స్థానాల్లో.. కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో కూటమి నేతల్లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే బయటకు ఇది ఫ్రెండ్లీ ఫైట్ అని చెబుతున్నప్పటికీ ఈ నిర్ణయం ఓట్ల చీలికకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కాంగ్రెస్ vs RJD:  వైశాలి, కహల్‌గావ్ (Kahalgaon), నార్కటియాగంజ్ (Narkatiaganj)
కాంగ్రెస్ vs సీపీఐ: రాజపకర్ (Rajapakar), రోసెరా (Rosera), బచ్వారా (Bachhwara), బీహార్ షరీఫ్ (Biharsharif) ఈ స్థానాల్లో ఇండియా కూటమి పక్షాలు నేరుగా తలపడుతున్నాయి. 

కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. సీపీఐ తొమ్మిది, సీపీఐ (ఎం) నాలుగు స్థానాల్లో బరిలోకి నిలిచాయి.  ఇక  ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ఉండదని తెలుస్తోంది. మహా కూటమి మేనిఫెస్టో ముసాయిదా కమిటీ ఇంకా ఏ నిర్ణయానికి రాకపోవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ రెండూ తమ సొంత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. 

RJD ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా అత్యధిక సీట్లలో (143) పోటీ చేస్తోందని, తమకు కొన్ని మినహాయింపులు అవసరమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం కూటమి ధర్మాన్ని తాము ఎల్లప్పుడూ పాటించామని, అయితే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా RJD, వామపక్షాలు కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపిస్తున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి

Advertisment
తాజా కథనాలు