RJD : RJD సంచలన నిర్ణయం.. 143 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.

New Update
BREAKING

BREAKING

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మహాఘటబంధన్ కూటమిలో సీట్ల పంపకాల ప్రతిష్టంభన మధ్య143 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. RJD నాయకుడు తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. బిహార్‌లో నవంబర్‌ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.నవంబర్ 6న జరిగే మొదటి దశ ఎన్నిక కోసం ఇప్పటి వరకు మొత్తం 1,375 నామినేషన్లు వేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, RJD ఈసారి ఒక సీటు తక్కువగా పోటీ చేస్తోంది. 2020లో 144 సీట్లలో పోటీ చేసింది. మహాకూటమిలో సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన వెలువడకముందే ఆర్జేడీ ఈ భారీ సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టడం కూటమిలో విభేదాలను స్పష్టంగా సూచిస్తోంది. ఈ అంతర్గత విభేదాలు అధికార ఎన్డీఏ (NDA) కూటమికి మరింత లబ్ది చేకూర్చవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు