21 ఏళ్ల నాటి కేసు.. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే RJD అభ్యర్థి అరెస్ట్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ తరఫున ససారం నియోజకవర్గం అభ్యర్థి సత్యేంద్ర షాను నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
rjd

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ తరఫున ససారం నియోజకవర్గం అభ్యర్థి సత్యేంద్ర షాను నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 21 సంవత్సరాల క్రితం నమోదైన ఓ పాత కేసులో కోర్టు నుంచి జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఆధారంగా జార్ఖండ్ పోలీసులు సత్యేంద్ర షా ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత సత్యేంద్ర షాను జైలుకు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

2004లో ఝార్ఖండ్‌లోని గర్హ్వా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఒక కేసు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం (అక్టోబర్ 20, 2025) నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సత్యేంద్ర షా బయటకు రాగానే, అక్కడ అప్పటికే మోహరించి ఉన్న ఝార్ఖండ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అభ్యర్థిని అరెస్ట్ చేయడంపై ఆర్జేడీ, మహాకూటమి (INDIA కూటమి) నాయకులు మండిపడుతున్నారు. ఇది తమ ప్రత్యర్థులు చేసిన రాజకీయ కుట్ర అని, ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్ట్ చేశారని ఆరోపించారు. 

పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆర్జేడీ అభ్యర్థి సత్యేంద్ర షా దీనిని తన ప్రత్యర్థుల కుట్ర అని అభివర్ణించారు. "కోర్టు వారెంట్ ఉన్నప్పటికీ, ఎన్నికలకు ముందు నన్ను అరెస్టు చేయలేదు. అయితే, రాష్ట్రీయ జనతా దళ్ నన్ను అభ్యర్థిగా నామినేట్ చేసినప్పుడు, నా ప్రత్యర్థులు కుట్ర పన్ని నన్ను అరెస్టు చేశారు" అని అన్నారు. "ఈసారి సత్యేంద్ర షాకు బదులుగా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  నేను ససారాం ప్రజల ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను" అని అన్నారు. 

Also Read : Pakistan : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం

సత్యేంద్ర షా అరెస్టు తర్వాత ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ కోసం గుమిగూడిన గ్రాండ్ అలయన్స్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షా విజయం సాధించారని ప్రకటించారు. సబ్‌డివిజన్ కార్యాలయం వెలుపల కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. మద్దతుదారుల భారీ గుంపు నగరంలోని ఓల్డ్ జీటీ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. బీహార్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అరెస్ట్ కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ అరెస్టుతో ససారం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 

Also Read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు