బీహార్ ఎన్నికల ముందు JDUలో కలకలం.. 2 రోజుల్లోనే 16 మంది సస్పెండ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు CM నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో తిరుగుబాటుపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా 16 మంది సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

New Update
CM Nitish Kumar

CM Nitish Kumar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో తిరుగుబాటుపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా 16 మంది సీనియర్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్ చేసిన నాయకుల్లో ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధ్యక్షులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అధికారిక NDA అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరఫున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన వారే కావడం గమనార్హం. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి, కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడం 'పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన' కిందకు వస్తుందని జేడీయూ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, మొదటి దశ పోలింగ్‌కు ముందు పార్టీలో తిరుగుబాటుదారులను అణచివేయడానికి నితీష్ కుమార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన ఈ నాయకులు ఇతర పార్టీల తరపున పోటీ చేయడమే కాకుండా, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు సమాచారం. ఈ చర్య ద్వారా ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులకు కఠిన సందేశాన్ని పంపాలని జేడీయూ అధిష్టానం భావించింది.

Advertisment
తాజా కథనాలు