DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు.
భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు.
ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది.
నాగర్ కర్నూల్ SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.
ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు.
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు.