Pahalgam Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు ఆర్మీని చూసి కూడా బెదిరిపోయిన పర్యాటకులు!

పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది పర్యాటకుల్ని చంపేశారు. దొరికినవారిని దొరికినట్లు చంపేయడంతో మిగిలిన పర్యాటకులు హడలిపోయారు. వారిని కాపాడాటానికి వచ్చిన ఆర్మీ జవాన్లను చూసి కూడా వారు వణికిపోయారు.

New Update
pahalgammm

pahalgammm

జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో రెప్పపాటులో తప్పించుకున్న కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో బెంబెలెత్తిపోయారు. కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు. తమ కళ్లేదుటే బిడ్డలు, భర్తలు, తోబుట్టువులు, బంధువులు,స్నేహితులు చనిపోయిన బాధతో గుండెలు విలసేలా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో తమను కాపాడటానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా మమ్మల్ని ఏం చేయోద్దంటూ భయంతో చేతులు జోడించి వేడుకున్నారు.

వారిని ఉగ్రవాదులు అనుకుని.. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అంటూ వేడుకున్నారు. గుండెల్ని మెలిపెట్టే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.భయంతో వణికిపోతున్న పర్యాటకులకు తాము మిమ్మిల్ని కాపాడటానికి వచ్చామని, మీకేమీ కాదని భారత సైనికులు ధైర్యం చెబుతుండటం వీడియోలో స్పష్టంగా వినపడుతోంది. బైసరన్ లోయలోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. హనీమూన్‌కు వచ్చి.. పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు.. తన భర్తను కోల్పోయింది. 

పహల్గాంలోని ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీకి  చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే మనీశ్ రంజన్.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి చనిపోయారు. ప్రాణభయంతో పారిపోతున్న చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి కాల్పులు జరిపి చంపేసినట్లు తెలుస్తుంది. చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా.. ఆయన కుటుంబసభ్యులు కశ్మీర్‌కు బయలుదేరారు. ఇక, ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే లష్కరే తొయిబా అనుబంధం సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ తామే దాడికి పాల్పడినట్టు తెలిపింది.

Also Read:Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

 Pahalgam attack | terrorists | army | india | pak | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు