Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు

ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది. 

New Update
India

India-pakistan Border

పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.  పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన బారత ఆర్మీ వారిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో మన ఆర్మీకి, పాక్ సైన్యానికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం సీజ్ ఫైర్ ఉల్లంఘించి కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చింది. 

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

5 గురు పాక్ సైన్యం మృతి?

కొంతసేపు పాటూ భారత ఆర్మీ, పాక్ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం ఆపకుండా బులెట్ల వర్షం కురిపించింది. దానికి తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీ కూడా జవాబు చెప్పింది. ఈ కాల్పుల్లో నలుగురు, ఐదుగురు చొరబాటుదారులు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అఫీషియల్ గా దీనిని ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. ఈ ఘటన తర్వాత కృష్ణ ఘాటి ప్రాంతంలో భారత సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

today-latest-news-in-telugu | india | pakistan | border | army

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు