Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది.
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది.
జీడిపప్పు పై పొట్టు, రసాయనాలు వినియోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో శ్రీ వెంకటరామ రైస్ మిల్ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్‌హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖలోని కేజీహెచ్‌లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు.
AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో మొదటి రోజే వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ పదవి ఆయన తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నగా మారింది. 2016లో చంద్రబాబు, 2023లో జగన్ కేబినెట్ హూదాతో ఆయన్ను నియమించారు. వాటికి నో చెప్పడంతో ఇప్పుడు ఏంచేస్తారా అని చూస్తున్నారు.