Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న! ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది. By Bhavana 15 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP News: ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి మరోసారి అక్షింతలు పడ్డాయి. ఇటీవల రాజకీయాలకు పనికి రావాలంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ కోసం పని చేయాలని వాసంశెట్టికి సీఎం చంద్రబాబు క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదికగా మరోసారి వాసంశెట్టి నిర్లక్ష్యం పై ఏపీ స్పీకర్ అయ్యన్న ఘాటుగా స్పందించారు. ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ లేకపోవడంతో ప్రశ్నను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం వాసంశెట్టి అసెంబ్లీకి వచ్చారు, దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న మంత్రికి చురకలు అంటించారు. ప్రజల కోసం గళం విప్పాల్సిన అసెంబ్లీలో, అది కూడా బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి అలస్యంగా వస్తే ఎలా అని వాసంశెట్టి ని స్పీకర్ ప్రశ్నించారు. Also Read: Telangana : ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్..ఒక్కొక్కరికి రూ.50 కోట్లు! ఇన్ టైమ్ లో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని, లేకపోతే అసెంబ్లీ సమయం వృథా అవుతుందని అయ్యన్న అన్నారు. అసెంబ్లీకి రావడానికి తన అలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానన్నారు.కాగా, బాధ్యత గా ఉండాలంటూ చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అంటే చాలా గౌరవమని, ఆయన తనకు తండ్రిలాంటివారని.. తనను ఓ మాట అంటారని, అవసరమైతే కొడతారంటూ వైరల్ ఆడియోపై మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. Also Read: నిజాం కూడా నీలాగా చేయలేదు.. అమోయ్ కుమార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ తీసుకున్న ఆడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్న కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మంత్రి సుభాష్ పై చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు ఓటర్ల నమోదుపై చంద్రబాబు ఎప్పటికప్పుడూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఎమ్మెల్యేలతోపాటు, కీలక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఓట్ల నమోదు నమోదు జరుగుతోందని, మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుండగా.. వాటిని పట్టించుకోవడం లేదని.. ఇలా చేస్తే రాజకీయాలకు సరిపోవని చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. Also Read: Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...! నువ్వు యంగ్‌స్టర్‌వి.. రాజకీయాలను ఇంకా సీరియస్‌గా తీసుకోలేదు. అందులోనూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, తొలిసారికే మంత్రివి దక్కించుకున్నావు. కానీ పట్లభద్రుల ఓటర్ల నమోదు, పార్టీ సభ్యత్వ నమోదులో నీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నావా.. 20 శాతం చేశావ్.. రంపచోడవరం 20 శాతం, రామచంద్రపురం 29 శాతమే అయ్యింది.. ఫస్ట్ టైం గెలిచావు. అయినప్పటికీ కూడా పార్టీ నీకు ఎంత గౌరవమిచ్చింది.. వేరే పార్టీ నుంచి వచ్చినా ప్రజలు గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తే ఆమాత్రం పట్టుదల లేకపోతే ఎట్లయ్యా.. అందరూ సీరియస్‌గా ఉండాలని మీ బాధ్యత మీరు చేయండి.. మీరు చేయకుంటే మేం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు ఎందుకని చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ వైరల్ ఆడియోపై స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు విలువైన సూచన చేశారని.. తనను తిడతారని, అవసరమైతే కొడతారని అందులో మీకేంటి సమస్య అన్నారు. #ayyanna-patrudu #ap-news #Vasamsetti Subhash #assembly-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి