/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/apsrtc-jpg.webp)
APSRTC
AP News: ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ అనేక కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది. తాజాగా మరో కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది ఆ సంస్థ. ఈ ఆఫర్ తో సీనియర్ సీనియర్ సిటిజెన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్‌కి 25శాతం రాయితీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!
60 ఏళ్లు పైబడిన వారందరికీ...
ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్ కు అయినా ఈ ఆఫర్ వస్తుందని ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ రాయితీ వస్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆఫర్ ను పొందేందుకు ఆరు రకాల గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డ్, పాప్‌పోర్ట్, పాన్ కార్డ్ ఇలా ఏదో ఒకటి చూపించి రాయితీని పొందవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఈ కార్డులను కేవలం ఫిజికల్‌గా మాత్రమే కాకుండా డిజిటల్ రూపంలో చూపించవచ్చని వెల్లడించింది.
- ఇకపై 60 సంవత్సరాల వయసు పై బడిన భారతదేశంలో ఏ రాష్ట్రం వారికైనా అన్ని APSRTC బస్సులలో 25% రాయితీ పొందవచ్చును.
— APSRTC (@apsrtc) November 15, 2024
- వయసు ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, గుర్తింపు కార్డు లలో ఏదో ఒక కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించవలెను pic.twitter.com/e9X1zGE7mx
Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోలకు కూడా ఆదేశాలు ఇచ్చారు అధికారులు. ఎంత దూరం ప్రయాణించినా 25శాతం వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు. ఈ ఆరు కార్డుల్ని రాయితీ కోసం అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా పంచారామక్షేత్రాలు, శ్రీశైలంకు స్పెషల్ బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలో నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే లక్ష్మీ కటాక్షం
Also Read: లోదుస్తులు ధరించి నిద్రించకూడదా?.. అసలు నిజం ఏంటి?