Kurnool: బాలికపై గ్రామ సర్పంచి అత్యాచార యత్నం!

కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

New Update
pharmacy student was gang raped in Warangal

Kurnool: కడదొడ్డి గ్రామ సర్పంచి హుసేనితో పాటు గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు తోవి వినోద్‌, మజ్జిగ సూరి ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పత్తిచేలో పని నిమిత్తం సుగ్గికి వలస వెళ్లారు. ఎనిమిదో తరగతి చదువుతున్న తమ కుమార్తెను తాత దగ్గర వదిలి వెళ్లారు.

Also Read: Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం

సర్పంచి హుసేనిని పట్టుకుని..

పది రోజుల కిందట కడదొడ్డి గ్రామ సర్పంచి హుసేనితో మిగిలిన ఇద్దరు కూడా రాత్రి 11 గంటల సమయంల ఇంట్రో పడుకున్న బాలిక పై అత్యాచార యత్నం చేస్తుండగా ...బాలిక తాత నిద్ర మేల్కొని సర్పంచి హుసేనిని పట్టుకుని గట్టిగా కేకలు వేశారు. దీంతో వారు ఆయనని తోసి పారిపోయారు.

Also Read: Madras Court: తెలుగు వారు వలస వచ్చిన వాళ్లు కాదన్న మద్రాసు హైకోర్టు

విద్యార్థిని తల్లిదండ్రులు మంగళవారం కోసిగి పోలీసు స్టేషన్‌ లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా ఎస్సై చంద్ర మోహన్‌ సర్పంచి హుసేని , వైసీపీ నాయకులు తోవి వినోద్‌, మజ్జిగ సూరి అనే ముగ్గురి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Also Read: US Cabinate: ట్రంప్ క్యాబినెట్‌లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు