Vizag KGH: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ..

విశాఖలోని కేజీహెచ్‌లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు.

author-image
By Kusuma
New Update
Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో డెలివరీకి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు సిజేరియన్ చేసి వైద్యులు మగ బిడ్డకు ప్రాణం పోశారు. అయితే మగ బిడ్డ తక్కువ బరువుతో పుట్టడంతో వెంటనే అవసరమైన చికిత్స అందించారు. అయిన కూడా ఆ శిశువు శనివారం ఉదయానికి ఊపిరి ఆడలేదు.

ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

బిడ్డ ప్రాణం పోయిందని..

వైద్యులు బిడ్డ ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పుట్టిన వెంటనే బిడ్డ మరణవార్త విని కుటుంబ సభ్యులు విషాదంలోకి మునిగిపోయారు. ఇంతలోనే ఆ శిశువులో కదిలికలు రావడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ఆ శిశువుని పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ యూనిట్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

వైద్యులు చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాదికారిని శిశువు కుటుంబ సభ్యులు వివరణ కోరారు. దీంతో వైద్యులు బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు అరుదుగా ఇలా ఊపిరి బిగబెట్టడం వల్ల కదలికలు లేకపోయే సరికి శిశువు మరణించిందని వైద్యులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

తక్కువ బరువుతో పుట్టే శిశువులు కొందరు ఊపిరి బిగబెట్టుకుని ఉండిపోతారని తెలిపారు. దీన్నే ఎపెనిక్ స్పెల్‌‌ అంటారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు క్షేమంగానే ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి కూడా ప్రస్తుతం క్షేమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చూడండి:  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు