BREAKING: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్!

AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ  నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
Sajjala Bhargav Reddy: సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు

Sajjala Bhargav Reddy: వైసీపీ  నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసు నమోదు అయింది. అధికార పార్టీ  నేతలే టార్గెట్ గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్

నాన్ బెయిలబుల్ సెక్షన్లు...

కాగా సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జిగా ఉన్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి, రాష్ట్ర నేత అర్జున్ రెడ్డి లపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత సామజిక వర్గానికి చెందిన హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టులపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read: YS Jagan: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్!

దూషణలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను భార్గవ్ రెడ్డి సమన్వయం చేస్తున్నట్లు ఆరోపణలు చేశాడు. అధికారపార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలల్లో దూషణ పోస్టులు పెడుతున్నారని.. భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర నేత అర్జున్ రెడ్డి తో పాటు మరొకరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read: కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్‌ విడుదల!

నిన్న వైసీపీ ఎమ్మెల్యేపై...

 సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పెద్దలపై, మహిళలు, అలాగే చిన్నారులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తాటిపర్తి  చంద్రశేఖర్ పై యర్రగొండపాలెంలో కేసు నమోదు అయింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం ఇదే తొలిసారి.

Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు