AP Assembly Sessions : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో మొదటి రోజే వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. By Kusuma 10 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి అనగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌కు ఆమోదం తెలిపి.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి మొత్తం 11 రోజుల పాటు.. ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం 11 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులైలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నవంబర్ వరకు నాలుగు నెలల పాటు తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. ఇది ఈ నెలాఖరుతో ముగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. దీనికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ వెళ్తున్నారో? లేదో? చూడాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చిన కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదని గతంలో తెలిపారు. ప్రతిపక్షంగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వెళ్తామని లేకపోతే లేదన్నట్లు సమాచారం. ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! #rtv #ap-news #ap-assembly-sessions #assembly-sessions #cm-chandrababu #ap-assembly-meet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి