ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు-PHOTOS
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు.
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.
AP ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి, రైతులకు రూ.7,000 చొప్పున (కేంద్రం పీఎం కిసాన్ వాటా రూ.2,000, రాష్ట్రం వాటా రూ.5,000) డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పడ్డాయి.
హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన అభినందించారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి కట్టబెట్టారని ఆరోపించారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంపై మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని ఆయన ఆరోపించారు.
డ్వాక్రా మహిళలకు మరింత ప్రయోజనం కలిపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారికోసం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. శిక్షణ కోసం ప్రభుత్వం రూ.23.84 కోట్లు కేటాయించింది.