TDP Jubilee hills by poll  : జూబ్లీహిల్స్‌లో టీడీపీ సంచలన నిర్ణయం..మద్ధతు ఎవరికంటే?

జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశం కావడం సంచలనంగా మారింది. ఇక్కడ అభ్యర్థిని నిలపడం లేదా మిత్ర పక్షం బీజేపీకి మద్దతు ఇవ్వడం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.

New Update
TDP's entry in Telangana

Telangana Telugu Desam Party

TDP Jubilee hills by poll  :  తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ అత్యంత కీలకంగా మారింది. ఈ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. అధికార పార్టీ కాంగ్రెస్‌ కు ఇక్కడ గెలుపు చాలా అవసరం. దీంతో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా, జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశం కావడం సంచలనంగా మారింది. ఇక్కడ పోటీకి  అభ్యర్థిని నిలపడం లేదా మిత్ర పక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వడం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారుతోందని అనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయకున్నా.. బీజేపీకి మద్దతు ఇస్తుందని అందరూ అంచనా వేసారు. కాగా.. మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు..ఏపీ నుంచి వచ్చి స్థిర పడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో... టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావించారు. కానీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి బిగ్‌ ట్టిస్ట్‌ ఇచ్చింది. అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయించి సంచలనం రేపింది.కాగా స్థానికంగా  పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని పార్టీ నాయకులతో చర్చించిన ఎపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. అంతేకాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. 

కాగా మంగళవారం తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. టీడీపీ మండల అధ్యక్షుల నియామకాలు త్వరలో పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు కోరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షునితోపాటు రాష్ట్ర కమిటీ నియామకంపై కూడా ఈ సంద్భంగా చర్చించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం పూర్తి చేసినట్లు, సంస్థాగత నిర్మాణం పూర్తిచేసి నాయకత్వాన్ని ప్రకటిస్తే.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకు వివరించారు. ఒకవేళ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమైతే.. ఈలోపు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. కమిటీల నియామకం పూర్తి చేసి కార్యక్రమాలు పెంచాలని వారికి సూచించారు. సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని ఆయన వెల్లడించినట్లు నేతలు తెలిపారు.

Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!

Advertisment
తాజా కథనాలు