Revanth Reddy: వివాదాలు వద్దు.. పరిష్కారం కావాలి.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నదీజలాల పంపకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా?  నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా అన్నారు.

New Update
CM Revanth

CM Revanth

నదీజలాల పంపకం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా?  నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్‌ అన్నారు.

Also Read :  Sankranti 2026: గాలిపటాలు సంక్రాంతికే ఎందుకు ఎగరేస్తారంటే?

CM Revanth Reddy's Key Comments

మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) కు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు.. రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది అన్నారు. - ap-water-board
మేం వివాదం కోరుకోవడంలేదు.. పరిష్కారం కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం అని రేవంత్‌ అన్నారు.

తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలన్న ఆయన..రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయన్నారు. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదు. అది ఏపీ అయినా,  కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. - Water Board Act

Also Read :  బాలలతో లైంగిక వేధింపుల వీడియోలు.. యూట్యూబర్‌ అరెస్ట్‌

Advertisment
తాజా కథనాలు