/rtv/media/media_files/2025/08/19/chandrababu-naidu-2025-08-19-12-59-28.jpg)
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. 'పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్‌షిప్' (P4)గా పిలవబడే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా, సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిని 'మార్గదర్శులు'గా, అట్టడుగు వర్గాలలోని పేద కుటుంబాలను 'బంగారు కుటుంబాలు'గా గుర్తించి, వారికి చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు. మార్గదర్శులుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు.
మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. బంగారు కుటుంబాలను గుర్తించి, వారి అవసరాలను ఒక ప్రత్యేక సర్వే ద్వారా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, వైద్య సహాయం, చిన్న వ్యాపారాల విస్తరణ వంటి అంశాలపై వారికి అవసరమైన సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బాబు గారు చేపట్టిన P4 మోడల్ మార్గదర్శి - బంగారు కుటుంబంతో గిరిజన మహిళకు గొప్ప భరోసా ఎలా లభించిందో ఈ వీడియో లో చూద్దాం👏👏🙏 #Margadarsi_BangaruKutumbam#P4Model#Chandrababu#AndhraPradeshpic.twitter.com/S13qcrYSEE
— AP Need CBN (@apneed_cbn) August 19, 2025
ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, భావోద్వేగ మద్దతు, మార్గదర్శకత్వం కూడా లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మార్గదర్శులుగా ముందుకు వచ్చే వ్యక్తులు స్వచ్ఛందంగా పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం కేవలం ఒక వేదికను మాత్రమే కల్పిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ప్రభుత్వం నేరుగా పాలుపంచుకోదని స్పష్టం చేసింది.
పీ4 అమలు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు https://t.co/7CDIXL4BZA
— Telugu Desam Party (@JaiTDP) August 19, 2025
P4 కార్యక్రమం అమలు కోసం జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మార్గదర్శిగా నమోదై, తన సొంత నియోజకవర్గం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమం కేవలం సంక్షేమ పథకాలను అందించడం కాదని, పేదరికాన్ని సమూలంగా తొలగించడానికి ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ P4 మోడల్ దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.