/rtv/media/media_files/2025/03/09/0SjrKkcv1bfFnFhfGEN4.jpg)
CM Chandra Babu naidu
ఆంధ్రప్రదేశ్(andhrapradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకాన్ని(Sanjivani scheme) అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి రోగులకు వైద్య సేవలను అందించి, తక్షణ చికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ సాంకేతిక సహాయంతో పాటుగా పూర్తి సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చినట్టు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వెల్లడించారు. శనివారం పల్నాడు మాచర్లలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ విషయంలో ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు.
Also Read : మహాలయ అమావాస్య .. తిరుపతి కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు
ప్రజల ఇంటివద్దకే వైద్య సేవలు
ఇప్పటికే సంజీవని పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్టు చెప్పిన ఆయన, అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు చిత్తూరులో కూడా దీనిని విస్తరించినట్లు తెలిపారు. రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవని కోసం కొండనే తెచ్చినట్టు , తాము కూడా ప్రజల కోసం ఈ పథకం ద్వారా అత్యాధునిక వైద్య సేవలను ఇంటివద్దకే అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సంజీవని పథకం కింద పేద ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రెండున్నర లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో పథకం ద్వారా పేదలకు 2 లక్షల 50వేల వరకు ఉచిత చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉచిత వైద్య సేవల పథకాన్ని అమలు చేయబోతున్నామని శుభవార్త చెప్పారు. ఇక ఇదే సమయంలో పల్నాడు జిల్లాకు ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని గురించి తెలిపిన ఆయన పల్నాడు జిల్లాకు జీవనాడి అయిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. సాగర్ కుడి కాలువకు గోదావరి నీటిని తీసుకువస్తామని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిర్చి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read : బాపట్లజిల్లా మార్టూరు NH 16 పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు