రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా విడుదల.. తెలంగాణ, ఏపీకి ఎంతంటే ?
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది.
తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు
పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయన జ్వరంతోపాటూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారట. అందుకే అందుకే ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్!
రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది.
తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.
భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు
టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.
పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. మధురైలో కేసు నమోదు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.
విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.