AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. మొదటగా దీనికి సంబంధించిన ఉత్తర్వులనే ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో జారీ చేసింది గవర్నమెంట్. 

author-image
By Manogna alamuru
New Update
AP

AP Government

ప్రభుత్వ ఉత్తర్వులు ఇక మీదట తెలుగులో ఉండాల్సిందే అంటూ ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది. ఈ మేరకు ఇంగ్లీషులోనూ  తెలుగులోనూ ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర  పోషిస్తాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. 

AP

Ap

Also Read: HMPV వైరస్‌ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన

Also Read: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన

ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో...

మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రత కు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని ప్రభుత్వం చెప్పింది. అందుకే  ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో నూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలను పంపామని తెలిపింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఆ తరువాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు  సాధారణ పరిపాలన శాఖ సూచనలిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

AP

Ap

Also Read: Manipur: మణిపూర్‌‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్‌ పై దాడి 

Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్‌ ఇండియాకు?

Advertisment
తాజా కథనాలు