Atchannaidu: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20 వేలు, మంత్రి కీలక ప్రకటన!

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలో రూ.20వేలు ఇస్తాం అని తెలిపారు. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తాము మాత్రం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

New Update
ap minister atchannaidu big announcement

ap minister atchannaidu big announcement

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.22వేల కోట్ల వడ్డీ కడుతుందని అని పేర్కొన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఓ రేంజ్‌లో మండిపడ్డారు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ONGC సంస్థ నష్టపరిహారం అందించేందుకు తాళ్లరేవు మండలం కొరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహకార మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read : ఆ ఇద్దరు మంత్రులు ఔట్..  సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

రాష్ట్రాన్ని దోచేశారు

ఐదేళ్లలో మొత్తం రాష్ట్రాన్ని దోచేశారని.. లక్షల కోట్లు అప్పులు చేశారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఫించన్ల పంపిణీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే ఇప్పుడు రెండు గంటల ముందే ఫించన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. 

Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్స‌ర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్

జగన్మోహన్‌ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజలను మోసం చేయాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం అని చెప్పుకొచ్చారు. ఇకతాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామన్నారు. 

Also Read: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్

రూ.20వేలు ఇస్తాం

ఈ హామిలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. అనంతరం మత్స్యకారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కానీ తాము మాత్రం మత్స్యకారుల జీవనోపాది పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే వారికి మత్స్యకార భరోసా అందిస్తామన్నారు. ప్రస్తుతానికి వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలో రూ.20వేలు ఇస్తాం అని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని.. దానితో సహా సూపర్ సిక్స్ హామిలలో మరికొన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

Advertisment
తాజా కథనాలు