/rtv/media/media_files/2025/01/06/iV85RoEnZXEh7V4RKZP2.jpg)
Nara Lokesh Rescues Another Woman from Gulf
పొట్ట కూటి కోసం విదేశాలు వెళ్లిన ఎంతోమంది భారతీయులు అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నారు. యజమానుల చేతిలో నలిగిపోతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా నిలవాలని ఎంతో మంది ఇండియన్స్ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి యజమానుల చేతిలో మోసపోతున్నారు.
ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే
బాధితుల నుంచి పాస్‌పోర్ట్ తీసుకుని బెదిరిస్తున్నారు. వారితో సేకరి, సేవలు చేయించుకుంటున్నారు. దీంతో నరకం అనుభవిస్తున్న బాధితులు తమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని వీడియోలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి మోసపోయిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మహిళ వీడియో రిలీజ్ చేసింది. తనను ఆదుకోవాలంటూ ఆ వీడియోలో మొరపెట్టుకుంది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ మహిళను ఇండియాకు తీసుకొచ్చారు.
ఏం జరిగిందంటే?
ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్ రషీదను రక్షించి, క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరారు. బతుకుదెరువు కోసం ఖతర్ వెళ్లిన తనను యజమాని అనేక చిత్రహింసలు పెడుతున్నాడని, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ క్యాన్సిల్ చేశారని, పాస్ పోర్ట్ కూడా లాక్కున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
ఇది కూడా చూడండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా
Noted. I'll do everything possible to bring her back home safely.@OfficeofNLhttps://t.co/EYrsNxCIu2
— Lokesh Nara (@naralokesh) January 3, 2025
తనను ఎలాగైనా రక్షించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్‌ను వేడుకున్నారు. తక్షణమే స్పందించిన మంత్రి.. తన టీం ద్వారా రషీదను స్వదేశానికి రప్పించారు. సాయం అడిగిన వెంటనే స్పందించి స్వదేశానికి చేరేలా చొరవ చూపిన మంత్రి లోకేష్ కు రషీద ధన్యవాదాలు తెలిపారు.