రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబాయి నటి జత్వానీ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు అధికారలకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!
చిత్ర హింసలు పెట్టారని..
వైసీపీ ప్రభుత్వ సమయంలో ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీని కొందరు ఐపీఎస్ అధికారులు 45 రోజుల పాటు బంధించి చిత్ర వధ చేశారని.. బట్టల్లేకుండా ఫొటోలు తీసి వేధించారని ఆరోపించింది. పలువురు తనకు న్యూడ్ కాల్స్ చేశారని, ఒక ఒంటరి యువతినైనా తనను చిత్రహింసలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులపై కూడా తప్పుడు కేసులు పెట్టారని గతంలో వాపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు కుటుంబ సభ్యులను కూడా బంధించి వేధించారు.
ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే...
కృష్ణా జిల్లాకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు వేధించారు. విద్యా సాగర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని గతంలో ఆమె తెలిపింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వం సమయంలో జరగ్గా.. కూటమి అధికారంలోకి రావడంతో జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యా సాగర్‌తో పాటు ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లు కూడా నిందితులుగా ఉన్నారు.
ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని!
ప్రధాన నిందితుడు అయిన విద్యా సాగర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టు వీరికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో