ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎంతో కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనకాపల్లి నుంచి ఆనందపురం ఎన్‌హెచ్ కారిడార్‌లో షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ.. సిక్స్ లేన్ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా.. ట్రాఫిక్ సమస్యలు క్లియర్.. సబ్బవరం గ్రామం దగ్గర ఈ రోడ్డు ప్రారంభం అయ్యి.. షీలానగర్ జంక్షన్‌లోని పోర్టు రోడ్డులో గెయిల్ ఆఫీస్ దగ్గరతో ఎండ్ అవుతుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే షీలానగర్ నుంచి ఆనందపురం వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే షీలా నగర్ నుంచి వెళ్లాలంటే విశాఖ సిటీలోని హైవే నుంచే వెళ్లాలి. దీనివల్ల ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అదే ఈ కారిడార్‌తో నగరవాసుల ట్రాఫిక్ సమస్యలు అన్ని కూడా తీరుతాయి. ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని అనుకుంటుంది. ఇది కూడా చూడండి: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా.. అందరికీ ఈ పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు.ఇక ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే