తెలంగాణలో సంక్రాంతి సెలవులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాఠశాలలు జనవరి 11 నుంచి 17 వరకు అలాగే కళాశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. జనవరి 18న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాలి. కానీ రాష్ట్రప్రభుత్వం ఈసారి రెండు రోజుల ముందుగానే హాలీడేస్‌ను ప్రకటించింది. సెలవులపై క్లారిటీ రావడంతో తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్ ఇదిలాఉండగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్రాంతి సెలవులపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అక్కడ పాఠశాలలు జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులపై స్పష్టత వచ్చింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. Also Read: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి! Also Read: ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి