Visakhapatnam: హాట్ హాట్‌గా విశాఖ రాజకీయం.. ఆయన రికార్డ్‌కు వైసీపీ బ్రేకులు వేసేనా?
వైజాగ్ రాజకీయమంటేనే సమ్‌థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీకే దక్కాయి. దీంతో 2024లో విశాఖ రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతుండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.