/rtv/media/media_files/2025/06/08/QREVnj8eyvJ3AWitU7Mc.jpg)
ap pgcet 2025 exams start from tomorrow full schedule
ఏపీ పీజీ సెట్-2025 పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచే (JUNE 9) పరీక్షలు మొదలు కానున్నాయి. దీని కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 9 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ ఎగ్జామ్స్ కోసం దాదాపు 25,000లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
జూన్ 25న ఫలితాలు
మరోవైపు ఈ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 30 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఈ పరీక్షల అనంతరం అందుకు సంబంధించిన ప్రాథమిక కీలను జూన్ 11వ తేదీ నుంచి 15 తేదీల మధ్య రిలీజ్ చేయనున్నారు. ఆపై ప్రాథమిక కీలపై డౌట్స్ ఏమైనా ఉంటే వాటికోసం జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాలను అందుకోనున్నారు. వీటన్నింటి తర్వాత జూన్ 25వ తేదీన రిజల్ట్స్ ప్రకటిస్తారు.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
పరీక్ష ఫలితాల ఆధారంగా AP PGCET --2025లో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ప్రవేశాల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ PG కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.
హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా
https://cets.apsche.ap.gov.in/APSCHE/ సైట్ లోకి వెళ్లాలి.
డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, బర్త్ డేట్, ఎగ్జామ్ పేపర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
అనంతరం సబ్మిట్ చేసిన తర్వాత హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
AP PGCET-2025 | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu | ap-jobs