Labor Law: ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు.

New Update
labor law

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెండచం కోసం రోజులో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఇకపై ఏపీలో 10గంటలు పని చేయాల్సి ఉంటుంది. కార్మికులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా కార్మిక చట్టాలను సవరించాలని నిర్ణయించినట్లు ఐ అండ్ పిఆర్ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని అన్నారు.

Also Read :  ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

Labor Law In AP

రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు. రోజుకు గరిష్టంగా 10 గంటల పని చేయోచ్చనే విధంగా కార్మిక చట్టాలను తయారు చేశారు. లేబర్ యాక్ట్‌లోని.. సెక్షన్ 55 ప్రకారం 5 గంటల పనికి ఒక గంట విశ్రాంతి ఉండేది. దానిని ఇప్పుడు ఆరు గంటలకు మార్చారు. కార్మిక చట్టాలను సవరించడానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ పార్థసారథి ఇటీవల అన్నారు.

Also Read :  తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం! (వీడియో)

అంతకుముందు, ఓవర్ టైం 75 గంటల వరకు మాత్రమే అనుమతించబడిందని, ఇప్పుడు మూడు నెలలకు 144 గంటల వరకు పొడిగించబడిందని పార్థసారథి పేర్కొన్నారు. దీని కారణంగా కార్మిక చట్టాలకు సవరణలు, కర్మాగారాల్లో పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తారని పార్థసారథి తెలిపారు. ఈ నియమాలు కార్మికులకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ మంది మహిళలు రాత్రి షిఫ్టులలో పనిచేయడానికి వీలుగా క్యాబినెట్ నైట్ షిఫ్ట్ నిబంధనలను కూడా సడలించిందని చెప్పారు. గతంలో మహిళలు నైట్ షిఫ్టులలో పనిచేయడానికి అనుమతి లేదు. కానీ ఇప్పుడు వారు ఇష్టంతో ట్రాన్స్‌పోర్ట్ కల్పించి, సేఫ్టీ, నిఘా వంటి రక్షణ చర్యలతో పని చేయవచ్చు. CPI రాష్ట్ర కార్యదర్శి K రామకృష్ణ కార్మిక చట్టాల సవరణలపై NDA కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Also Read :  కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బిగ్ అప్డేట్!

Also Read :  HYDలో దారుణం.. శవాన్ని దహనం చేస్తుండగా ఎగసిపడిన నిప్పురవ్వలు - ఊరు ఊరంతా భయంతో పరుగులు!

 

latest-telugu-news | working-women | working-womens | Working Hours | labor law | today-news-in-telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
తాజా కథనాలు