TTD: ఆన్లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడులో చోటుచేసుకుంది. ఆ బాలిక ఆడుకుంటుండగా ఆ బాలుడు గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు బాలుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.
బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. బుధవారం జగన్ పర్యటనలో కంటెపుడి దగ్గర అంబటి రోడ్డుపై ఉన్న బారికేడ్స్ తొలగించిన సంగతి తెలిసిందే.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించి.. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
రేపు జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పొదిలి ఘటన నేపథ్యంలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పర్యటన చేసి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.