/rtv/media/media_files/2026/02/23/ap-2026-02-23-13-09-54.jpg)
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(kcr) పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ గనుక ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తామంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి రావాలని చూస్తే అస్సలు అడుగుపెట్టనివ్వమని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా శెట్టిబలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ ని తన్ని తరిమేస్తాడు అంట.. ఏపీ మంత్రి.. అవసరమా ఇలాంటి మాటలు?
— Tupaki (@tupaki_official) February 23, 2026
ఏపీ–తెలంగాణ మధ్య సున్నిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ, నేతల వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలన్న ప్రజల ఆశలకు విరుద్ధంగా తాజా రాజకీయ పదజాలం మారుతోంది.
ఇప్పుడు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు మరో వివాదానికి… pic.twitter.com/dsD0lF4Ghm
Also Read : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!
వారి భవిష్యత్తును నాశనం
తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో కలిపేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని, ఆ పాపమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని సుభాష్ విమర్శించారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన కులాలను విడదీయలేరని, బీసీల మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హక్కులను కేసీఆర్ కాలరాశారని మంత్రి ధ్వజమెత్తారు.
తన పాత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, గతంలో తాను కేసీఆర్ను విమర్శించినప్పుడు హైదరాబాద్ రా చూసుకుందాం అని సవాల్ చేశారని, కానీ తాను అక్కడికి వెళ్లినా తనను ఎవరూ ఏమీ చేయలేకపోయారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. బీసీల వ్యతిరేక విధానాలు అవలంబించే వారికి ఏపీలో తావు లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : అనంతబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు పోలీసులపై వేటు
Follow Us