/rtv/media/media_files/2026/02/23/mlc-2026-02-23-11-30-40.jpg)
తిరుమల కల్తీ లడ్డూ(tirumala laddu) వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్(nara lokesh), మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana latest) మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. లడ్డూ కల్తీపై ఉన్న నిజానిజాలను అసెంబ్లీ సాక్షిగానే బయటపెడతామని లోకేష్ సవాల్ విసిరారు. వైసీపీ నేతలు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు.. రావడం సభ్యుల బాధ్యత అంటూ సభకు రాని వైసీపీ సభ్యులపై లోకేష్ సెటైర్లు వేశారు.
Also Read : పాలు కాదు.. ప్రాణాలు తీసే విషం! రాజమండ్రిలో ఇద్దరు బలి.. 13 మంది పరిస్థితి విషమం!
బొత్స కౌంటర్
మరోవైపు లోకేష్ వ్యాఖ్యలపై మండలిలో బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ(ap-assembly) లో ఏం చర్చిస్తారనేది తమకు అనవసరమని, కానీ మండలిలో మాత్రం కచ్చితంగా చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని, దేవుడిపై నిందాపనిందలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. నెయ్యి ధరల గురించి ప్రస్తావిస్తూ.. ఇందాపూర్ మార్కెట్‌లో రూ. 500లకే నెయ్యి దొరుకుతుంటే, టీటీడీకి రూ. 658కి సరఫరా జరిగిందని, ఇందులో తప్పు ఎక్కడ ఉందో చర్చించాలని బొత్స కౌంటర్ ఇచ్చారు.
Also Read : విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్ నుంచి వెళ్లి లాడ్జిలో...
Follow Us