/rtv/media/media_files/2026/02/23/milk-2026-02-23-07-53-59.jpg)
మనం అమృతం అనుకుని తాగే పాలు.. అదే మన ప్రాణాలు తీసే విషంగా మారితే అవును రాజమండ్రిలో సరిగ్గా ఇదే జరిగింది. పొద్దున్నే లేచి తాజా పాలు అనుకుని తాగిన ఆ ఇల్లాలు, కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ ఇళ్లలో ఇప్పుడు పాలు తాగాలన్నా భయంతో జనం వణికిపోతున్నారు.
@VidaBhargav
— BRN NEWS 24/7 (@VidaBhargav) February 23, 2026
రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం
చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో సరఫరా అయిన కల్తీ పాలు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
చిన్నారులు, వృద్ధులు ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురవుతూ రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.#Rajahmundry
రాజమండ్రి చౌడేశ్వర నగర్‌లో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ పాలు తాగిన వారిలో కృష్ణవేణి(85), కనకరత్నం(70) అనే ఇద్దరు వృద్ధురాళ్లు చికిత్స పొందుతూ మరణించారు. ఇదే పాలు తాగిన మరో 13 మందికి తీవ్ర అనారోగ్యం చేయడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.
రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం.. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు.. కల్తీ పాలు తాగడంతో రెండు కాలనీవాసులకు అస్వస్థత.. రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు.. ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పడుతున్న చిన్నారులు, వృద్ధులు..
— Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets) February 23, 2026
వ్యాపారి అరెస్ట్
బాధితులందరూ అనూరియా అనే వింత సమస్యతో బాధపడుతున్నారు. దీని అర్థం ఏంటంటే.. శరీరంలోని కిడ్నీలు దెబ్బతిని, మూత్రం రావడం పూర్తిగా ఆగిపోవడం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కల్తీ పాలు అమ్ముతున్న వ్యాపారిని అరెస్ట్ చేశారు. అధికారులు పాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
అయితే, ఈ మరణాలు కచ్చితంగా కల్తీ పాల వల్లే జరిగాయా? లేక అపార్ట్‌మెంట్‌లోని వాటర్ ట్యాంకర్లు క్లీన్ చేయకపోవడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ సోకిందా? అన్న కోణంలోనూ డాక్టర్లు ఆరా తీస్తున్నారు. పూర్తి ల్యాబ్ రిపోర్ట్స్ వస్తేనే ఈ విషాదానికి అసలు కారణం ఏంటో తేలనుంది.
Follow Us