/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
Tirumala Tirupati Devasthanams .
తిరుమల(tirumala) లో మహిళను పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు క్యూలైన్లో నిలబడి ఉండగా పాము కాటేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. భక్తురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులిద్దరూ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. వారు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో ఉన్న సమయంలో ఆమెను పాము కాటు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే మౌనికను హుటాహుటిన అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ మౌనికకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వేచి ఉండే క్యూలైన్‌లను క్షుణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో మౌనిక క్యూలైన్‌లో ఉన్న సమయంలో ఆమెను పాము కాటు వేసిందనే వార్తలను టీటీడీ ఖండించింది. మహిళా భక్తురాలికి పాము కాటు అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని వెల్లడించింది.
Also Read : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!
పాము కాటు వేయలేదు..టీటీడీ
‘‘ శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రోజున శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారని తెలిపారు.. ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపంలో ఉన్న ఆర్బీ సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకున్నారన్నారు. ఆ సమయంలో మౌనిక(A snake and women) తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లిందన్నారు. ఈ క్రమంలో కాలుపై ఏదో పారినట్లు అనిపించడంతో భయబ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ కు విషయాన్ని చెప్పడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది. దీంతో పాము కాటేసిందనే అనుమానంతో వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారన్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి పాము కాటు(snake bite incident) లేదని నిర్ధారించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని అధికారులు తెలిపారు. అలాగే, అక్కడ కనిపించిన ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలిందన్నారు. వారు ఈరోజు ఉదయం క్షేమంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది’’ అని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు.
Also Read : పాలు కాదు.. ప్రాణాలు తీసే విషం! రాజమండ్రిలో ఇద్దరు బలి.. 13 మంది పరిస్థితి విషమం!
Follow Us