Anantababu Case :  అనంతబాబు కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

New Update
FotoJet (39)

MLC Anantha Babu

డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(ycp mlc anantha babu driver case) తో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు(suprime court big shock) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. కోర్టు ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. 2022 మే 19న డ్రైవర్‌ హత్య జరగగా హత్య కేసు విచారణలో ప్రదాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసు అధికారులను రాష్ర్ట ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో లోపాలపై  సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Also Read :  జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు.. మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

Big Twist In Anantababu Case

హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(mlc-anantha-babu) కు డిఫాల్ట్‌ బెయిల్‌ అందించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని, అత్యంత హేయమైన నేరంలో పోలీసుల తీరు ఆక్షేపణీయమని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిందితులకు కొమ్ము కాసిన పోలీసులపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. హత్య జరిగిన సమయంలో  ఎమ్మెల్సీకి సహకరించిన అప్పటి పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో కేసులో కీలక ఆధారాలు కావాలన్న విషయాన్ని  విస్మరించడమే కాకుండా నిందితుడైన అనంతబాబుకు సహకరించినట్లు కోర్టు ఆరోపించింది. అలా సహకరించిన నలుగురు పోలీస్‌ అధికారులపై డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది.

కాగా ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన వారిలో కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న వి.భీమారావు, వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో కేసు నమోదైన సర్పవరం స్టేషన్‌ ఎస్‌ఐగా ఉండి, ప్రస్తుతం కాకినాడ పోర్టు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌.సతీష్ బాబు తదితరులు ఉన్నారు. ఈ పోలీసు అధికారులపై వెంటనే క్రమశిక్షణ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. విచారణ సజావుగా సాగేందుకు క్రమశిక్షణ ప్రొసీడింగ్స్‌ పూర్తయ్యే వరకు వీరి సస్పెన్షన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరిపై హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో విచారణ కూడా జరుగనుంది. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read :  అంబటికి బిగ్‌ రిలిఫ్‌... ఆ కేసులో బెయిల్‌ మంజూరు

Advertisment
తాజా కథనాలు