Supreme court : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.

New Update
supreme

తిరుమల లడ్డూ(Tirumala laddu row) ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court) లో పెద్ద ఊరట లభించింది. ఈ కేసుపై ప్రముఖ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో నియమించిన ఏకసభ్య కమిటీ తన విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన పని తాను చేసుకోవచ్చని, దీనిపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Also Read :  కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని

ఈ తీర్పుతో లడ్డూ కల్తీకి సంబంధించి జరుగుతున్న దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన లోపాలు, కల్తీకి బాధ్యులైన వారిని గుర్తించే పనిలో ఉన్న ఏకసభ్య కమిటీకి ఇప్పుడు న్యాయపరంగా పూర్తి మద్దతు లభించినట్లయింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read :  జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు.. మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

Advertisment
తాజా కథనాలు