Iran Ceasefire: యుద్ధం ఆగలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన!
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది.
F, M, J నాన్ - ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా బిగ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రకాల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ మోడ్‌కు సెట్ చేసుకోవాలని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతి-2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్, ఫోర్డో, నటాంజ్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైనికుల బీ2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడాన్ని CPI(ML) ప్రతిఘటన తీవ్రంగా ఖండించింది. అమెరికా చాలా కాలం క్రితమే ఇరాన్‌ను ఉగ్రవాద రాజ్యంగా ప్రకటించిందని తెలపింది.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు.
అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇరాన్‌పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చాడు.