Trump: అమెరికాలో పెరిగిన ధరలు.. ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల అనేక దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం వల్ల అమెరికాలో వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల అనేక దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం వల్ల అమెరికాలో వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 

Also Read: ఆ దేశంలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

అమెరికాలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. గొడ్డు మాసం, అరటిపండ్లు, నారింజ, కాఫీ, ఇతర పండ్ల రసం లాంటి ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. ఇటీవల ట్రంప్‌ ఆయా దేశాలపై సుంకాలు విధించినప్పుడు.. ఆ ప్రభావం అమెరికన్లపై పడదని ట్రంప్ అన్నారు. కానీ అక్కడ గొడ్డు మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. 

Also Read: ఇండియాలో ఎక్కువకాలం ముఖ్యమంత్రులుగా పని చేసింది వేరే!

దీంతో అక్కడి వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు. వాస్తవానికి బ్రెజిల్ నుంచి అమెరికాకు గొడ్డు మాసం ఎగుమతి అవుతుంది. అయితే బ్రెజిల్‌ పై కూడా ట్రంప్ 50 శాతం వరకు సుంకాలు విధించారు. దీంతో ఆ మాంసం ధరలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బీఫ్‌తో పాటు పలు ఆహార ఉత్పత్తులు, ఎరువులపై సుంకాలు తొలగిస్తూ ఎగ్జిక్యూటీన్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. 

Advertisment
తాజా కథనాలు