/rtv/media/media_files/2025/03/24/XPj9O91a0wjwFArxM7q5.jpg)
F1 Visa
F1 Visa: అమెరికా విద్యార్థులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగెళ్తామని నిరూపించుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. దీనికి సంబంధించిన ఇంటెంట్ టు లీవ్ అనే నిబంధనను రద్దు చేయనున్నారని చెబుతున్నారు. ఎఫ్-1 వీసాల జారీలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంటెంట్ టులీవ్’ నిబంధనరద్దుదిశగాడిగ్నిటీయాక్ట్-2025ను చట్టసభ్యులుప్రతిపాదించారు. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని చెబుతున్నారు. ఈ చట్టం కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందాలి. ఆ తర్వాత ట్రంప్ దానిపై సంతకం చేయాలి.
Also Read: నేడే రాజ్యాంగ దినోత్సవం.. ప్రతి భారతీయుడి ఆత్మవిశ్వాసం, ఆశయాల సంకేతం!
ఇంటెంట్ టు లీవ్ రూల్ వల్లన వీసాల రద్దు..
ప్రస్తుతం చాలా ఎఫ్-1 వీసాలు ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందనేరిజెక్ట్ అవుతున్నాయి. దీని ప్రకారం విద్యార్థి వీసాల కోసం అప్లే చేసుకునే విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికా విడిచి వెళ్ళిపోతామని అధికారి వద్ద నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా భారంగా మారింది. ముఖ్యంగా భారత విద్యార్థులకు. దీని కారణంగా ఈ ఏడాది భారతీయ విద్యార్థుల వీసాల జారీ సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ఇంటెంట్ టు లీవ్’ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం వల్లనేఅని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ రూల్ తీసేస్తే..అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.
Also Read: smell marks in India: టైర్లకు గులాబీ వాసన..రిజిస్టర్ చేసిన భారత ట్రేడ్ మార్క్
Follow Us