/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t080437475-2025-12-04-08-05-18.jpg)
F16 Fighter Jet: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-16సి ఫైటర్ జెట్ కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధవిన్యాసాల ప్రదర్శనల స్క్వాడ్రన్‌గా పిలిచే ‘థండర్‌బడ్స్’ కు చెందిన ఈ ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో కుప్పకూలింది.
USA — F-16 CRASH IN CALIFORNIA
— Mossad Commentary (@MOSSADil) December 3, 2025
An F-16C fighter jet crashed during a training exercise near Death Valley.
The pilot ejected safely and sustained only minor injuries.
Investigation is underway.
Stay connected, follow @MOSSADilpic.twitter.com/PNmzEJHOP5
విన్యాసాలు చేస్తున్న క్రమంలో విమానం నేలను ఢీకొట్టింది. ట్రోనా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోనే ఈఘటన చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.45 గంటలకు ఈ విమానం కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. విమానం కుప్ప కూలటంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది.
అయితే విమానం కుప్పకూలడానికి ముందే ఫైలట్ ఫ్లైట్ నుంచి పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను అధికారులు రిడ్జెక్రెస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా తమ స్క్వాడ్రన్‌కు చెందిన ఫైటర్ జెట్ కూప్పకూలినట్లు ‘థండర్‌బడ్స్’ ధ్రువీకరించింది.
అయితే ఎఫ్-16 ఫైటర్ పాల్కన్ జెట్‌లతో ఈ ప్రాంతంలో తరచూ అమెరికా ఎయిర్ ఫోర్స్ నిరంతరం యుద్ధవిన్యాసాల శిక్షణ చేపడుతుంది. మొత్తం 6 థండర్‌బడ్స్ జెట్స్ తో శిక్షణ ఇస్తుండగా వాటిలో ఒకటి మాత్రమే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలిపోయిన ఎఫ్-16 ఫైటింగ్ జెట్‌లో కేవలం ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Follow Us