New York: న్యూయార్క్ లో విమాన ప్రమాదం...!
న్యూయార్క్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు
న్యూయార్క్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు
ట్రంప్‌నకు బెదిరింపులు రావడం తాజాగా కలకలం సృష్టిస్తుంది. ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 ఆగస్టులో డజను గుడ్లు 2.04 డాలర్లు (రూ.175) కాగా, 2025 మార్చిలో అది 6.23 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోడిగుడ్లు కొనాలంటే రూ.536 చెల్లించాలి. ఒక్కో గుడ్డుకు రూ.44 లు పడుతుంది.
అమెరికాలోని న్యూయార్క్ హడ్సన్ నదిలో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈప్రమాదంలో పైలట్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ల్యాండింగ్ టైంలో వాతావరణం అనుకూలించక హెలికాఫ్టర్ నదిలో పడిపోయింది.
అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై భారత సంతతికి చెందిన సీఈఓ అనురాగ్ బాజ్‌పేయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాగ్ బాజ్‌పేయి ప్రస్తుతం క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రాడియంట్ సీఈఓగా ఉన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్, సిరిమా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.
ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితే.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్ఎస్ చెప్పింది.
మస్క్...ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.నవారో మస్క్ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.దీని పై ఎలాన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు.