Kavitha: ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత..ఆమెను చూసి కేసీఆర్‌ ఏం చేశారంటే...

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి కేసీఆర్ దగ్గరకు వచ్చారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికాకు వెళ్తున్నారు. దీంతో కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం కవిత వచ్చారు

New Update
kcr kavitha

Kavitha reached the farmhouse

Kavitha:  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కవిత  తన కుటుంబ సభ్యులతో కలిసి  బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు దగ్గరకు వచ్చారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికాకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల పాటు అమెరికాలోనే కల్వకుంట్ల కవిత ఉండనున్నారు.ఈ క్రమంలో తాత ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె కొడుకు కేసీఆర్‌ మనవడు ఆర్యతో కలిసి ఎర్రవల్లి… ఫామ్ హౌస్ కు కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత వచ్చారు. కవిత అమెరికా పర్యటనకు  ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది.

ఎమ్మెల్సీ కవిత చిన్న కుమారుడు ఆర్య ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్నారు. దీంతో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పించేందుకు కవితతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం తన కుమారుడితో కలిసి.. కవిత అమెరికాకు బయలుదేరి వెళ్తారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అమెరికా శాఖ కార్యకర్తలతో కవిత సమావేశం అవుతారు. తెలంగాణ జాగృతిని తెలంగాణ వ్యా్ప్తంగానే కాకుండా ప్రపంచవ్యా్ప్తంగా విస్తరించేందుకు ఆమె ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి పలువురితో సమావేశం అయ్యాక అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు.  

తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. కాగా ఫౌం హాజ్ లో కవిత, కేటీఆర్ ఎదురు పడినట్లు తెలిసింది.  కాగా ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత సుమారు గంటపాటు అక్కడే గడిపారు. కవిత దంపతులిద్దరూ కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అక్కడే భోజనం చేసిన వారు ఆ తర్వాత హైదరాబాద్ కు తిరగి వెళ్లారు. ఆమె వెళుతున్న సమయంలోనే హరీశ్ రావు కూడా ఎదురుపడినట్లు తెలిసింది.

Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

 ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యలో ఈ  అంశంపై చర్చించనున్నారు.  వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం మీద ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఇక గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని స్వా్తంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.  ఈ తరుణంలో కవిత శుక్రవారం ఎర్రవల్లిలోని తన తండ్రి ఫామ్‌హౌస్‌కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు