BIG BREAKING: చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేస్తామని బెదిరించాడు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ భద్రత కోసం భారత్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని చెప్పింది.

New Update

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేస్తామని బెదిరింపులకు దిగాడు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికాలో ఉండి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ కామెంట్స్ చేయడం సిగ్గుచేటు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మునీర్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని ఇండియా స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం తాము ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని పాక్‌ ఆర్మీ చీఫ్‌కు భారత్ కౌంటర్ ఇచ్చింది.

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా భారత్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన న్యూక్లియర్ బెదిరింపులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అమెరికా పర్యటనలో ఉన్న అసిమ్ మునీర్ ఫ్లోరిడాలోని టాంపలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ నుంచి తమ దేశానికి ముప్పు వస్తే "సగం ప్రపంచాన్ని తమతో పాటు లాక్కుపోతామని" బహిరంగంగా అణు హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం వస్తే.. అణుబాంబు ప్రయోగిస్తామంటూ మునీర్ అన్నారు. పాకిస్తాన్ ఓ న్యూక్లియర్ దేశం, మేం నాశనమైతే.. సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అన్నారు.

అమెరికా గడ్డపై నిలబడి మూడవ దేశంపై ఇంతటి తీవ్రమైన బెదిరింపులకు పాల్పడటం ఇదే మొదటిసారి అని నిపుణులు పేర్కొన్నారు. మునీర్ కేవలం బెదిరింపులకే పరిమితం కాకుండా, సింధూ నది జలాల ఒప్పందం గురించి కూడా ప్రస్తావించారు. భారత్ ఈ నదిపై డ్యామ్‌లు కడితే, వాటిని పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వ్యాఖ్యలను అనుచితమైనవి, బాధ్యతారాహిత్యమైనవని అభివర్ణించింది. ఇలాంటి బెదిరింపులు ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని భారత్ పేర్కొంది. పాకిస్థాన్ తన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకొని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది.

మునీర్ వ్యాఖ్యలు అమెరికాలో కూడా విమర్శలకు గురయ్యాయి. అమెరికా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, పాకిస్థాన్ ఒక అణుశక్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను భారత్ చాలా సీరియస్‌గా గమనిస్తోంది. తన భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా తగిన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.

అసిమ్ మునీర్ ఈ పర్యటనలో అమెరికా రాజకీయ, సైనిక నాయకులను కూడా కలిశారు. ఈ సమావేశాల తరువాతే ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సంఘటన భవిష్యత్తులో భారత్-పాకిస్తాన్ సంబంధాలపై, అలాగే పాకిస్తాన్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు