Trump Tariffs: ట్రంప్ 50% సుంకాలతో భారత్‌కు వచ్చే నష్టం ఇదే!

బారత్‌పై అమెరికా విధించిన పన్నులు 50శాతానికి చేరింది. ఈ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి.

New Update
trump tax backstep

Tariff impact on India

ట్రంప్ భారత్‌పై కక్ష్య గట్టాడు. అమెరికా(America) విరోధి రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు భారత్‌పై సుంకాల భారం(Tariff impact on India) మోపుతున్నాడు. ఇప్పటికే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ 25 శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే.. అయితే ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని మరో 25 శాతం సుంకాలు పెంచాడు. బుధవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులను వైట్‌హౌస్ విడుదల చేసింది. దీంతో మొత్తం బారత్‌పై అమెరికా విధించిన పన్నులు 50శాతానికి చేరింది. ఈ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.

Also Read :  ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం.. 12వేల హెక్టార్ల అడవి దగ్ధం

ప్రధాన ప్రభావాలు:

ఎగుమతులపై ప్రభావం: భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు పోటీని కోల్పోతాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, సముద్రపు ఆహారం, మెకానికల్ ఆటో విడిభాగాలు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కొన్ని అంచనాల ప్రకారం, 25% సుంకం వల్ల దాదాపు 50% భారత ఎగుమతులు ప్రభావితం కావచ్చు.

రాగి, ఉక్కు మరియు అల్యూమినియం: రాగిపై 50 శాతం, ఉక్కు మరియు అల్యూమినియంపై ఇదే విధమైన సుంకాలు విధించడం వల్ల ఈ ఉత్పత్తుల ఎగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ఇది దేశీయ తయారీదారులకు నష్టాలను తెచ్చిపెట్టవచ్చు.

వస్త్ర పరిశ్రమ:భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు భారత్‌పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి. దీంతో భారతీయ వస్త్ర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని ఎదుర్కోవడానికి కష్టపడుతున్నాయి.

ఫార్మా రంగం:భారతదేశం ప్రపంచంలోనే జెనరిక్ ఔషధాల అతిపెద్ద ఎగుమతిదారు. ఈ రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాల పెంపు వల్ల ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడవచ్చు. అయితే, అమెరికా తన దేశీయ అవసరాల దృష్ట్యా ఫార్మా ఉత్పత్తులపై కొత్త సుంకాల పెంపును విస్తృతంగా అమలు చేయలేదు.

ఆటో మెబైల్స్ పరికరాలు: భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఆటో విడిభాగాలపై సుంకాల పెంపు వల్ల, ఈ రంగంలో దాదాపు 8 శాతం ఉత్పత్తి ప్రభావితం అవుతుందని అంచనా.

వజ్రాలు, ఆభరణాలు:వజ్రాలు, బంగారు ఆభరణాలపై సుంకాల పెంపు వల్ల వీటి ధరలు పెరిగి, ఎగుమతులు తగ్గవచ్చు. దీంతో దుబాయ్, బెల్జియం వంటి ట్రేడింగ్ కేంద్రాలకు ఎగుమతులు మళ్లించే అవకాశం ఉంది.

ఆర్థిక నష్టం: ఈ సుంకాల కారణంగా భారత్ GDP వృద్ధి 0.3% వరకు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం 25 శాతం ఉన్నప్పుడే.. తాజాగా మరో 25 శాతం పెంచడంతో ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ ఎగుమతులు మాత్రమే సుమారు 4-5 బిలియన్ డాలర్ల వరకు పడిపోవచ్చని ఒక నివేదిక తెలిపింది. ఇది MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చేసి, ఉద్యోగ నష్టాలకు దారితీయవచ్చు.

Also Read :  ఏలియన్స్ వస్తున్నాయి.. సౌరకుటుంబంలోకి కొత్త గ్రహం

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై హెచ్చరికలు

ట్రంప్ సుంకాల పెంపునకు ప్రధాన కారణం రష్యా నుంచి భారతదేశం ముడి చమురు, రక్షణ ఉత్పత్తులను కొనడం. ఇది అమెరికాకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని ట్రంప్ ఆరోపించారు. రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో భారత్ ఆ దేశంతో వాణిజ్యం కొనసాగించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రతిగా సుంకాలతో పాటు అదనపు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు