Viral VIdeo: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!

అమెరికా జార్జియా రాష్ట్రంలో ఆకాశం నుంచి ఓ ఇంటిపై పడిన ఉల్క శకలం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ 26న మెక్‌డొనౌగ్ పట్టణంలోని ఒక ఇంటి పైకప్పుని ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఈ ఉల్క దాదాపు 4.56 బిలియన్ల సంవత్సరాల నాటిదని పరిశోధనల్లో తేలింది.

New Update
Meteorite

Meteorite in Georgia

అమెరికా జార్జియా రాష్ట్రంలో ఆకాశం నుంచి ఓ ఇంటిపై పడిన ఉల్క శకలం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. గత జూన్ 26న మెక్‌డొనౌగ్ పట్టణంలోని ఒక ఇంటి పైకప్పుని ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఈ ఉల్క దాదాపు 4.56 బిలియన్ల సంవత్సరాల నాటిదని పరిశోధనల్లో తేలింది. ఈ ఉల్క శకలం మన భూమి కంటే సుమారు 2 కోట్ల సంవత్సరాలు పురాతనమైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని గురించి షాకింగ్ విషయాలు తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఉల్క పడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

పగలు జరిగిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. సూపర్‌సోనిక్ వేగంతో దూసుకొచ్చిన ఈ ఉల్క శబ్దం వందల మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు కూడా వినిపించింది. ఇళ్ల పైకప్పును చీల్చుకుని నేలను తాకినప్పుడు 15 మిల్లీమీటర్ల చిన్న గుంత ఏర్పడింది. దాదాపు చెర్రీ పండు పరిమాణంలో ఉన్న ఈ ఉల్క బరువు 23 గ్రాములు అని శాస్త్రవేత్తలు తెలిపారు.

జార్జియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను సేకరించి పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన స్కాట్ హ్యారిస్, ఈ ఉల్క శకలం భూమి కంటే చాలా పాతదని నిర్ధారించారు. భూమి 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. ఈ ఉల్క శకలం అంగారకుడు, బృహస్పతి మధ్య ఉన్న గ్రహశకలాల బెల్ట్ నుంచి వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఈ ఘటనతో ఇంటి యజమాని నివాసంలో ఖగోళ ధూళి కణాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉల్క పడినప్పుడు వచ్చిన శబ్దం ఒక భారీ తుపాకీ పేలినట్లుగా ఉందని యజమాని చెప్పాడు. సాధారణంగా ఇలాంటి ఉల్కలు మహాసముద్రాలు లేదా మారుమూల ప్రాంతాల్లో పడతాయని, నివాస ప్రాంతంలో పడటం చాలా అరుదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు