US Woman Coma: అవయవాలు దానం చేస్తుండగా.. చివరి క్షణంలో కోమాలోంచి బయటకొచ్చింది

అమెరికాలో అద్భుతం చోటుచేసుకుంది. అవయవదాన శస్త్రచికిత్సకు కొన్ని క్షణాల ముందు కోమాలో ఉన్న ఓ మహిళ స్పృహలోకి రావడం వైద్యులను, బంధువులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన న్యూ మెక్సికోలోని అల్బుకెర్క్‌లోని ప్రెస్‌బిటేరియన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

New Update
Comatose woman woke up

అమెరికాలో అద్భుతం చోటుచేసుకుంది. అవయవదాన శస్త్రచికిత్సకు కొన్ని క్షణాల ముందు కోమాలో ఉన్న ఓ మహిళ స్పృహలోకి రావడం వైద్యులను, బంధువులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన న్యూ మెక్సికోలోని అల్బుకెర్క్‌లోని ప్రెస్‌బిటేరియన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న మహిళ కోమాలోకి వెళ్లింది. ఆమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు చెప్పడంతో, ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు.

శస్త్రచికిత్స కోసం మహిళను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లగా, చివరి నిమిషంలో ఓ నర్స్ ఆమె కళ్లలో కదలికను గుర్తించింది. దీనిపై అనుమానం వచ్చిన డాక్టర్లు ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మెదడులో జీవక్రియలు ఇంకా కొనసాగుతున్నాయని తేలింది. దీంతో అవయవదాన ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత ఆ మహిళ కోమా నుంచి పూర్తిగా బయటపడి మాట్లాడటం ప్రారంభించింది.

ఈ సంఘటన వైద్య చరిత్రలో ఒక అద్భుతమని, ఇది మనిషి మెదడు, శరీరం ఎంత సంక్లిష్టంగా పనిచేస్తాయో తెలియజేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన మహిళకు, ఆమె కుటుంబానికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కోమాలో ఉన్న రోగుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, పూర్తిగా నిపుణుల బృందంతో పరీక్షించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు